
ఇస్లామాబాద్ : కులభూషణ్ జాదవ్ కుటుంబ సభ్యుల విషయంలో పాకిస్థాన్ అధికారులు అనుసరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరోసారి కట్టుకథలు చెప్పేందుకు పాక్ సిద్ధమైంది. తాము కావాలని జాదవ్ భార్య షూను విప్పించలేదని, ఆమె షూలో ఏదో వస్తువు ఉన్నట్లు తాము గుర్తించిన నేపథ్యంలో దానిని పరిశీలించేందుకు తీయించామని పాక్ విదేశాంగ కార్యాలయ అధికారిక ప్రతినిధి మహ్మద్ ఫైజల్ చెప్పారు. ’ఆమె షూలో ఏదో ఉంది. దానిని మేం పరిశీలిస్తున్నాం.
అయితే, జాదవ్ భార్యకు ఆ షూ స్థానంలో కొత్త షూ ఇచ్చాం. అలాగే ఆమె ఆభరణాలు ఇతర వస్తువులు తిరిగి ఇచ్చేశాం. ఇక జాదవ్ కుటుంబ సభ్యులను వేధించామని భారత్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. అయిన భారత్ చేసే ఇలాంటి ఆరోపణలు మేం పట్టించుకోం’ అని ఫైజల్ అన్నారు. గూఢచర్యం కేసును మోపి అరెస్టు చేసిన కారణంగా ప్రస్తుతం భారత్‌కు చెందిన కులభూషణ్ జాదవ్ పాక్ జైలులో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆయనను కలిసేందుకు భార్య, తల్లి వెళ్లగా వారి తాళి, బొట్టు, గాజులు, షూ కూడా తీయించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్‌లో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment