జాదవ్‌ కేసులో సంచలన విషయం వెలుగులోకి.. | Kulbhushan Jadhav Was Kidnapped from Iran | Sakshi
Sakshi News home page

జాదవ్‌ కేసులో సంచలన విషయం వెలుగులోకి..

Published Thu, Jan 4 2018 5:32 PM | Last Updated on Thu, Jan 4 2018 5:50 PM

Kulbhushan Jadhav Was Kidnapped from Iran - Sakshi

కులభూషణ్‌ జాదవ్‌ ను కిడ్నాప్‌ చేసిన ముల్లా ఒమర్‌ ఇరానీ (జైషే ఉల్‌ అదల్‌ ఉగ్రవాది)

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ నోటికి తాళం వేసే ఆధారాలను భారత రక్షణ విభాగం సంపాధించింది. కులభూషణ్‌ జాదవ్‌ను అక్రమంగా పాకిస్థాన్‌ తమ దేశంలో బంధించిందని అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు కావాల్సిన ఆధారాలను తాజాగా ప్రకటించింది. జాదవ్‌ను పాక్‌ ఆర్మీకి అత్యంత సన్నిహితంగా ఉండే జైషే ఉల్‌ అదల్‌ అనే ఉగ్రవాద సంస్థ ఇరాన్‌లో కిడ్నాప్‌ చేసి పాక్‌కు అప్పగించినట్లు తమ వద్ద ఆధారాలున్నట్లు భారత్‌ ప్రకటించింది.

ఆ వివరాల ప్రకారం జైషే ఉల్‌లో పనిచేసే ముల్లా ఒమర్‌ అనే ఇరానీ సంతతి ఉగ్రవాది చబహార్‌ అనే ప్రాంతంలో జాదవ్‌ను అక్రమంగా కిడ్నాప్‌ చేసి పాక్‌ ఆర్మీకి అప్పగించాడు. జైషే ఉల్‌ అదల్‌ అనేది జమాత్‌ ఉద్‌ దవా, లష్కరే ఈ ఖురాసన్‌ అనే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగించడమే కాకుండా పాక్‌ ఆర్మీకి సాయం చేస్తూ ఇరాన్‌, బహ్రెయిన్‌లోని పాక్‌ రాయబార కార్యాలయాల్లో డబ్బు తీసుకుంటూ పనిచేస్తుంది. ముఖ్యంగా వీరు బలుచీస్థాన్‌ పోరాట వీరులను అణిచివేసేందుకు పాక్‌ ఆర్మీతో కలిసి అతి క్రూరంగా సామాన్యులను చంపేసేవారని కూడా తెలిసింది. జాదవ్‌ తమకు ధన్యవాదాలు చెప్పినట్లు పాక్‌ మోసపూరిత వీడియోను విడుదల చేసిన రోజే భారత్‌ ఈ విషయాన్ని బయటపెట్టి పాక్‌ ఆటకట్టించినంత పనిచేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement