kulbhushan jadhav mother plea
-
ఆమె షూలో ఏదో ఉంది..!
ఇస్లామాబాద్ : కులభూషణ్ జాదవ్ కుటుంబ సభ్యుల విషయంలో పాకిస్థాన్ అధికారులు అనుసరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరోసారి కట్టుకథలు చెప్పేందుకు పాక్ సిద్ధమైంది. తాము కావాలని జాదవ్ భార్య షూను విప్పించలేదని, ఆమె షూలో ఏదో వస్తువు ఉన్నట్లు తాము గుర్తించిన నేపథ్యంలో దానిని పరిశీలించేందుకు తీయించామని పాక్ విదేశాంగ కార్యాలయ అధికారిక ప్రతినిధి మహ్మద్ ఫైజల్ చెప్పారు. ’ఆమె షూలో ఏదో ఉంది. దానిని మేం పరిశీలిస్తున్నాం. అయితే, జాదవ్ భార్యకు ఆ షూ స్థానంలో కొత్త షూ ఇచ్చాం. అలాగే ఆమె ఆభరణాలు ఇతర వస్తువులు తిరిగి ఇచ్చేశాం. ఇక జాదవ్ కుటుంబ సభ్యులను వేధించామని భారత్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. అయిన భారత్ చేసే ఇలాంటి ఆరోపణలు మేం పట్టించుకోం’ అని ఫైజల్ అన్నారు. గూఢచర్యం కేసును మోపి అరెస్టు చేసిన కారణంగా ప్రస్తుతం భారత్‌కు చెందిన కులభూషణ్ జాదవ్ పాక్ జైలులో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆయనను కలిసేందుకు భార్య, తల్లి వెళ్లగా వారి తాళి, బొట్టు, గాజులు, షూ కూడా తీయించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్‌లో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. -
ఒకరిది పేగుబంధం.. మరొకరిది కట్టుకున్న బంధం
-
కులభూషణ్ తల్లి, భార్య రియాక్షన్ చూశారా..
ఇస్లామాబాద్ : ఎట్టకేలకు కులభూషణ్ జాదవ్ భార్య, తల్లి పాకిస్థాన్ జైలులో కలుసుకున్నారు. ప్రస్తుతం పాక్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆయనను కలిసి దాదాపు అరగంటపాటు మాట్లాడారు. తొలుత భారత్ నుంచి పాక్ రాయబార కార్యాలయంలో ఎదురుచూసిన వారు అనంతరం ఆయనను కలుసుకున్నారు. అనంతరం వారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. వారితో భారత హైకమిషన్ అధికారులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడనే ఆరోపణల కిందట పాక్ జాదవ్ ను అరెస్టు చేసి జైలులో వేసిన విషయం తెలసిందే. దీంతోపాటు అతడికి ఉరి శిక్షను కూడా విధించింది. అయితే, దీనిని వెంటనే అమలు చేయాలనుకున్న పాక్ చేసిన ప్రయత్నాలను భారత్ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు అంతర్జాతీయ సమాజాన్ని కూడా పాక్‌ను నిందించేలా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలుత అసలు జాదవ్‌ను కలిసేందుకు వీలే లేదంటూ చెప్పిన పాక్ భవిష్యత్‌లో ఎదురవ్వబోయే పరిణామాలు దృష్టిలో పెట్టుకొని వెనక్కు తగ్గింది. ఇటీవలె జాదవ్‌ను కలిసేందుకు ఆయన భార్య, తల్లికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత హైకమిషన్ అధికారి జేపీ సింగ్‌తో సహా జాదవ్ తల్లి, భార్య పాక్ విదేశాంగ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి జాదవ్‌ను జైలులో అరగంటపాటు కలిశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా పాక్ విడుదల చేసింది. ఇదే రోజు సాయంత్రం జాదవ్ తల్లి, భార్య భారత్‌కు తిరిగి రానున్నారు. -
కులభూషణ్ తల్లి పిటిషన్‌ను పరిగణిస్తున్నాం: పాక్
ఇస్లామాబాద్: కులభూషణ్ జాదవ్‌కు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూ వేసిన ఆయన తల్లి వేసిన పిటిషన్ తమకు చేరిందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధాన సలహాదారు సర్తాజ్ అజీజ్ స్పష్టం చేశారు. ఆ పిటిషన్‌ను తాము పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. కులభూషణ్‌కు పాక్ విధించిన మరణ శిక్షను సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్‌ను ఏప్రిల్ 26న ఆయన తల్లి పిటిషన్ వేసింది. దీనిని భారత హైకమిషనర్ పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శికి అందజేశారు. తమ దేశంలో గూఢచర్యం నిర్వహించారనే ఆరోపణలతో పాకిస్థాన్ జాదవ్‌కు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసు ప్రస్తుతం భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితిని నెలకొల్పింది. ఇప్పటికే పాకిస్థాన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎదురుదెబ్బతగిలిన విషయం తెలిసిందే. అయితే, పాక్ మాత్రం దీనిపై స్పందిస్తూ ‘పాకిస్థాన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఓడిపోయిందని చెప్పడం పూర్తిగా తప్పవుతుందని, కోర్టు కేవలం ఉరి శిక్షపై స్టే మాత్రమే విధించిందనే విషయం గుర్తించాలని అజీజ్ అన్నారు.