న్యూయార్క్: అత్యున్నత నైపుణ్యం గల వృత్తి నిపుణులకు ఉద్దేశించిన హెచ్-1బీ వీసాలపై ట్రంప్ సర్కారు తీవ్ర ఆంక్షలు విధించడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి సార్వత్రిక అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ తో భేటీ అయ్యారు. సుష్మా-టిల్లర్సన్ భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా హెచ్-1బీ వీసాలపై అంశాన్ని సుష్మా గట్టిగా ప్రస్తావించారు. ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలో డ్రీమర్స్ (స్వాప్నికులు)గా ఉన్న 8వేలమంది భారతీయుల దుర్భర స్థితిని ఆమె లేవనెత్తారు. అమెరికాలో ఉద్యోగం చేసే తల్లిదండ్రుల వెంట చిన్నారులుగా వచ్చిన వలసదారులను డ్రీమర్స్ గా పీలుస్తారు. నిర్ణీత వలస పత్రాలలేని వీరికి ఒబామా సర్కారు కల్పించి ప్రొటెక్షన్ వచ్చే ఏడాది మార్చ్ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి డిపోర్ట్ ముప్పు ఎదుర్కొంటున్న 8వేల మంది భవిష్యత్తు గురించి సుష్మా టిల్లర్సన్ తో భేటీ ప్రస్తావించారని అధికారులు తెలిపారు.
హెచ్-1బీ వీసాపై తీవ్ర ఆందోళన!
Published Sat, Sep 23 2017 1:42 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement