కశ్మీర్ కాదు.. ఉగ్రవాదంపై చర్చిద్దాం!
పాకిస్తాన్ లేఖకు భారత్ జవాబు
న్యూఢిల్లీ: కశ్మీర్‌పై చర్చలకు సిద్ధమంటూ పాకిస్తాన్ తాజాగా చేసిన సూచనపై భార త్ ఘాటుగా స్పందించింది. చర్చలంటూ జరిగితే ముందు ఉగ్రవాదంపై మాట్లాడతామని గురువారం స్పష్టం చేసింది. కశ్మీర్ వివాదంపై చర్చలకు రమ్మంటూ పాక్ విదేశాంగ శాఖ ఆగస్టు 19న రాసిన లేఖకు ప్రతిగా.. ‘సీమాంతర ఉగ్రవాదంపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అదే మా అసలు సమస్య. అక్రమంగా ఆక్రమించుకున్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను వెంటనే ఖాళీ చేయండి’ అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జయశంకర్ జవాబిచ్చారు. మరోవైపు, అణు సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ)లో పాకిస్తాన్‌ను చేర్చాలంటూ ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ ప్రతినిధి సజ్జద్ హుస్సేన్ కోరారు.