గ్లోబల్ టీచర్ ప్రైజ్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంచి ఉపాధ్యాయులను ఎంపిక చేసి మరీ ఇచ్చే అవార్డు. ఈ అవార్డు కింద దాదాపు రూ. 6.66 కోట్ల మొత్తం ఇస్తారు. కానీ, ఇలాంటి అవార్డు పొందిన ఓ టీచర్... షాపులో వెయ్యి రూపాయల విలువ చేసే జాకెట్ చోరీ చేశారట! అమెరికాలోని ఎడ్జ్‌కూంబ్ అనే ప్రాంతంలో 'ద సెటర్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్' అనే సంస్థను స్థాపించిన నాన్సా ఆట్వెల్ మొత్తం 127 దేశాలకు చెందిన 1300 మంది పోటీదారులను తోసిరాజని ఈ అవార్డు పొందారు. దుబాయ్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. తన స్కూలు అభివృద్ధికి ఈ డబ్బు వినియోగిస్తానని అప్పట్లో చెప్పారు.
మార్చి 28వ తేదీన ఆమె డమారిస్కోటా ప్రాంతంలోని ఓ స్టోరుకు వెళ్లారు. అక్కడ హ్యాంగర్‌కు వేలాడుతున్న జాకెట్ తీసుకుని, దాన్ని మడతపెట్టి తన హ్యాండ్ బ్యాగ్‌లో దాచేసుకోడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అయితే, తాను మరో జాకెట్ ఎక్స్చేంజి చేసుకోడానికి వచ్చానని, పాతది ఇచ్చేసి కొత్తది తీసుకున్నానని.. సెక్యూరిటీ సిబ్బంది పొరపాటు పడ్డారని చెబుతున్నారు. కానీ చోరీకి ప్రయత్నించినట్లు ఆమె మీద కేసు పెట్టడంతో కోర్టుకు హాజరై అక్కడ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
6.6 కోట్ల బహుమతి వచ్చినా.. దుకాణంలో చోరీ!
Published Fri, Apr 8 2016 12:41 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
Advertisement