డెన్మార్క్‌లో తెలంగాణ జాగృతి శాఖను సోమవారం ఏర్పాటు చేశారు.
సాక్షి, హైదరాబాద్: డెన్మార్క్‌లో తెలంగాణ జాగృతి శాఖను సోమవారం ఏర్పాటు చేశారు. డెన్మార్క్ రాజధాని కొపెన్ హాగెన్‌లో జాగృతి ఆవిర్భావ సమావేశాన్ని తెలంగాణ జాగృతి యూరోప్ అధ్యక్షుడు సంపత్ ధనంనేని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ కోసం పనిచేసే వారందరినీ కలుపుకొని జాగృతి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. డెన్మార్క్‌లోని తెలంగాణ వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. నూతన సభ్యులకు ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు.