
పాక్‌లోని ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టాల్సిందే: బరాక్
పాకిస్థాన్‌లోని టెర్రరిస్టు స్థావరాలను అమెరికా ఉపేక్షించే ప్రసక్తే లేదని, వాటిని సమూలంగా నిర్మూలించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండియా టుడే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
వాషింగ్టన్: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను అమెరికా ఉపేక్షించే ప్రసక్తే లేదని, వాటిని సమూలంగా నిర్మూలించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 'ఇండియా టుడే' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ముంబై మహానగరం మీద ఉగ్రవాదులు జరిపిన 26/11 దాడుల కేసులో నిందితులకు శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్తో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నంత మాత్రాన పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను అమెరికా ఉపేక్షిస్తుందన్న భావన కూడదని చెప్పారు. పరస్పర విశ్వాసం ప్రాతిపదికన భారత్, అమెరికా సంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో వీటిని మరింత బలోపేతం చేసుకునేందుకే తాము ప్రాధాన్యత ఇస్తామని భారత్ పర్యటన నేపథ్యంలో ఒబామా వ్యాఖ్యానించారు.