ఢాకా(బంగ్లాదేశ్): భద్రతా సిబ్బంది చుట్టుముట్టారని తీవ్రవాదులు తమని తాము పేల్చేసుకున్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న చపాయినవాబ్‌జంగ్ జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు దేశంలో పోప్ ప్రాన్సిస్ పర్యటన నేపథ్యంలో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ గాలింపు చర్యలో భాగంగా ఒక గుడిసెను చుట్టుముట్టారు.
భద్రతా సిబ్బంది హెచ్చరిచటంతో: లోపల ఉన్న వారిని లొంగిపోవాలని భద్రతా సిబ్బంది హెచ్చరించారు. గుడిసెలో ఉన్న వారు తమను తాము పేల్చేసుకున్నారు. ఫలితంగా గుడిసెతోపాటు ముగ్గురు వ్యక్తులు కాలి బూడిదయ్యారు. భారత సరిహద్దుల్లో పద్మానది ఒడ్డున ఈ ప్రాంతానికి ఈ ముగ్గురూ పదిహేను రోజుల క్రితం వచ్చారని.. పక్షులపై పరిశోధనలు చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నారని స్థానికులు తెలిపారు.
ఉగ్రవాదుల సమాచారం: ఇది వరకూ దొరికిపోయిన ఉగ్రవాదులు అందించిన సమాచారం ఆధారంగా తీవ్రవాదుల స్థావరాన్ని గుర్తించినట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఆ ప్రాంతం నుంచి రెండు పిస్టళ్లు, మూడు గ్రెనేడ్లు, 8 డిటొనేటర్లు, పేలుడు సామాగ్రి తయారీలో వాడే పదార్థాలు పెద్ద మొత్తంలో లభించాయి. ఈ ఘటనకు సంబంధించి భవన యజమాని భార్య నజ్మా బేగం, ఆమె తల్లి మినారా బేగం, తండ్రి, ఖుర్షీద్‌లను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment