'స్వస్తిక్' అంటే దుర్మార్గమా..? | The George Washington University is preparing to ban from its campus an important Hindu religious symbol | Sakshi
Sakshi News home page

'స్వస్తిక్' అంటే దుర్మార్గమా..?

Published Tue, Apr 28 2015 1:36 PM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM

'స్వస్తిక్' అంటే దుర్మార్గమా..?

'స్వస్తిక్' అంటే దుర్మార్గమా..?

'స్వస్తిక్' గుర్తు ఇప్పుడు అగ్రరాజ్యంలో కలకలం రేపుతోంది. స్వస్తిక్ ముద్రను అమెరికాలోని ఓ యూనివర్శిటీ ఏకంగా క్యాంపస్లో నిషేధించేందుకు సిద్ధమవుతుంది. ఇంతకీ జార్జి వాషింగ్టన్ యూనివర్శిటీ స్వస్తిక్ను ఎందుకు బ్యాన్ చేయాలనుకుందంటే ... ఆ చిహ్నం  వల్ల కొందరు విద్యార్థుల మనోభావాలు దెబ్బతినటమే కారణమట.  

'ఓం' లాగానే స్వస్తిక్ చిహ్నం  మనదేశంలో ధార్మికతకు గుర్తు. స్వస్తిక్' ను హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఈ విషయం చాలామంది పాశ్చాత్యులకు తెలియదు. అయితే ప్రపంచ దేశాల్లో స్వస్తిక్ అనేది హిట్లర్ స్థాపించిన నాజీ పార్టీ గుర్తుగా  ప్రాచుర్యం పొందింది. స్వస్తిక్‌ అనగానే ఈ జర్మన్‌ నాజీల చిహ్నమే వారికి గుర్తుకొస్తుంది. వీరు దానిని'దుర్మార్గానికి' సంకేతంగా భావిస్తారు.  అలాంటి నాజీ పార్టీ గుర్తు వల్ల కొందరు విద్యార్థుల మనోభావాలు దెబ్బతింటున్నాయని యూనివర్శిటీ వర్గాల అభిప్రాయం.

ప్రాచ్య మతాలను అధ్యయనం చేస్తున్న ఒక యూదు విద్యార్థి భారత్కు వచ్చి హిందువులు పవిత్ర చిహ్నమైన స్వస్తిక్తో యూనివర్శిటికి వచ్చాడు. సంస్కృత భాషలో హిదువుల చిహ్నాన్ని స్వస్తికా ('వి') అని పిలసుస్తారు. అయితే విశ్వవిద్యాలయంలోని మరో యూదు విద్యార్థి ఆ చిహ్నాన్ని చూసి నాజీ గుర్తు స్వస్తికా ('వ')గా అపార్థం చేసుకున్నాడు. ఆ గుర్తును చూసిన అతడు నాజీల ప్రమాదాన్ని ఎదుర్కొనబోతున్నట్లు భావించాడు.

దీనిపై వర్శిటీ అధికారులకు ఫిర్యాదు కూడా చేయటంతో స్వస్తిక్ గుర్తుపై రగడ మొదలైంది. 'వాల్యూవాక్.కామ్ కథనం ప్రకారం స్వస్తిక్ చిహ్నాన్ని నిషేధించే విషయంలో వర్శిటీ అధికారులు త్వరలో తమ నిర్ణయాన్నిప్రకటించనున్నారు. మరోవైపు, ఈ నిర్ణయాన్ని ఇదే వర్సిటీకి చెందిన మరో ప్రొఫెసర్ తప్పుబట్టడం విశేషం.

ఇక స్వస్తిక్ గుర్తును చూసి పాశ్చాత్యులు ఎంత వెర్రిగా ప్రవర్తిస్తారంటే ...తినే తిండిలో సైతం అటువంటి గుర్తు కనిపిస్తే సహించలేరు. గతంలో అమెరికాలోని కరొలినాలో ఓ మహిళ మెక్ డొనాల్డ్ లో శాండ్ విచ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే బ్రెడ్ ముక్కలను తెరిచి చూస్తే అందులో స్వస్తిక్ రూపం కనించింది. అంతే ఎవడ్రా ఈ శాండ్విచ్ తయారు చేసిదంటూ కోపంతో ఒక్కసారిగా ఊగిపోయింది. అక్కడవారిపై అరవటమే కాకుండా మెక్ డొనాల్డ్స్కు ఘాటుగా లేఖ రాసింది.

పొరపాటు అయ్యిందంటూ సారీ చెప్పటమే కాకుండా,శాండ్ విచ్ను తయారు చేసిన వ్యక్తిని ఉద్యోగంలో నుంచి పీకేసింది. సదరు సంస్థ అమ్మగారి కోపం చల్లారేందుకు మరొక చికెన్ శాండ్ విడ్ ఫ్రీగా ఇచ్చింది. అంతేకాకుండా ఇటీవలి అమెరికాలోని హిందూ దేలయాలపై దాడులు జరుగుతున్నాయి. కొంతమంది దుండగులు హిందూ దేవాలయాలపై దాడి చేయడమే కాకుండా  స్వస్తిక్ గుర్తు వేసి గెటవుట్ అని రాతలు రాయటం సంచలం సృష్టించిన విషయం తెలిసిందే.

(వెబ్ సైట్ ప్రత్యేకం)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement