
బుజ్జమ్మ కాజూలిస్తే.. కాకమ్మ కానుకలిచ్చె!
మనకు ఇష్టమైన వాళ్లు ఇచ్చిన ఏ గిఫ్ట్ అయినా అపురూపంగా దాచుకుంటాం కదా! ఈ ఫొటోలో ఉందే ఈ అమ్మాయి పేరు గబీమన్. ఉండేది అమెరికాలోని వాషింగ్టన్‌లో. ఈ చిన్నారికి కూడా కొందరు ‘అరుదైన స్నేహితులు’ బహుమతులు ఇచ్చారట. వాళ్లెవరు అనుకుంటున్నారా! కాకులు..! అవునండీ కాకులే! కాకులేంటీ గిఫ్ట్‌లేంటీ అనుకుంటున్నారా! ఒకరోజు అనుకోకుండా ఈ చిన్నారి వాటికి కాజూలు పెట్టిందట. మరి పాప నచ్చిందో లేక పెట్టిన ఫుడ్ నచ్చిందో తెలీదు కాని రోజూ వాటికి ఏదైనా వస్తువు దొరికితే తీసుకొచ్చి ఇస్తుండేవట.
చెవి పోగులు, పెండెంట్లు, గోళీలు, గాజు పెంకులు, జేబు గుండీలు, రంగు రాళ్లు ఇలా ఏది పడితే అది తీసుకొచ్చి ఇచ్చేవట. అవే వాటికి ఎంతో విలువైనవిగా కనిపించి ఉం టాయి...! ఆ పాప కూడా వాటిని పడేయకుండా ఎంతో మురిపెంగా చూసుకుంటోంది. హౌ స్వీట్ కదా!