
విన్సెంట్ ఫొటో తీస్తే..
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలో రాత్రివేళ ఆకాశంలో నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. విన్సెంట్ లాఫోరెట్ అనే ఫొటోగ్రాఫర్ హెలికాప్టర్ నుంచి బయటకు వేలాడుతూ దాదాపు 7500 అడుగుల ఎత్తు నుంచి ఈ చిత్రాన్ని క్లిక్మనిపించారు. ఓ మేగజైన్ కోసం న్యూయార్క్ ఏరియల్ వ్యూ ఫొటోలు అవసరం కావటంతో విన్సెంట్ ఇలా వినూత్నంగా ఆలోచించి సాహసోపేతంగా ఈ ఫొటో తీశారు.