'చనిపోతానని అనుకున్నా' | Thought I Was Going To Die says Richard Branson | Sakshi
Sakshi News home page

'చనిపోతానని అనుకున్నా'

Published Sat, Aug 27 2016 9:16 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

'చనిపోతానని అనుకున్నా' - Sakshi

'చనిపోతానని అనుకున్నా'

లండన్: బ్రిటన్ వ్యాపారవేత్త, 'వర్జిన్' వ్యవస్థాపకుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్(66) ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో తన ఇద్దరు పిల్లలతో కలిసి సైక్లింగ్ చేస్తున్న సమయంలో ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆయన వర్జిన్ వెబ్సైట్ ద్వారా వెల్లడించారు.

ప్రమాదానికి గురి కాగానే తాను చనిపోతున్నట్లు భావించానని బ్రాన్సన్ వెల్లడించారు. ముఖంపై గాయాలతో ఉన్న ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు. ప్రమాదంలో తలకిందులుగా పడిపోయానని, ఒక్కసారిగా మొత్తం చీకటిగా మారిందని తెలిపారు. అదృష్టవశాత్తూ దవడ, భుజాలకు మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. కేవలం హెల్మెట్ ధరించడం మూలంగానే ప్రాణాలతో బయటపడినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement