మధుమేహం రాకుండా ఉండాలంటే..
దీంతోపాటు ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దాదాపు రెండు లక్షల మందిపై జరిగిన అధ్యయనాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. పాలకూర, క్యాబేజీ వంటివి ఎక్కువగా తినాలి. కూల్‌డ్రింక్స్‌కు పూర్తిగా దూరంగా ఉండటం ద్వారా కూడా మధుమేహాన్ని దూరం పెట్టొచ్చని యూకే, యూఎస్‌లోని 17 ప్రాంతాల్లో జనాభాపై జరిగిన అధ్యయనం స్పష్టం చేస్తోంది. జంతు ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడాన్ని తగ్గిస్తే మధుమేహం వచ్చే అవకాశం 20 శాతం వరకు తగ్గుతుంది. వీటితోపాటు గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మేలని ఇంకో అధ్యయనం సూచిస్తోంది. రోజూ కాఫీ తాగడం ద్వారా మధుమేహానికి దూరంగా ఉండొచ్చని దాదాపు 85 వేల మందిపై జరిగిన అధ్యయనం ద్వారా తెలుస్తోంది.