వాషింగ్టన్: కరోనా విజృంభణతో వేలాది మరణాలు చోటుచేసుకుంటున్న అమెరికా తమ పౌరులను స్వదేశానికి రానీయకుండా అడ్డుకుంటున్న దేశాలపై వీసా నిబంధనలు కఠినతరం చేస్తామని తెలిపింది. తమ దేశస్తులను స్వదేశానికి రప్పించడానికి నిరాకరించిన దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వీసా ఆంక్షలను ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 ప్రబలిన నేపథ్యంలో ఇతర దేశాల్లో ఉన్న తమ పౌరులు, అమెరికా జాతీయులను స్వదేశానికి రానీయకుండా.. ‘వీసా మంజూరును నిలిపివేయడం.. లేదా ఉద్దేశపూర్వకంగా మంజూరులో ఆలస్యం’ చేస్తున్న దేశాలపై వీసా నిబంధనల విషయమై కఠినంగా ఉంటామని ట్రంప్ తెలిపారు. హోంల్యాండ్ సెక్యురిటీ అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన ఈమేరకు మెమొరాండం జారీ చేశారు.
(చదవండి: కోవిడ్ చికిత్సకు హెచ్‌సీక్యూ–ఐజీ)
అమెరికా పౌరులను అడ్డుకుని వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా, అధ్యక్షుడి ఆదేశాలు తక్షణం అమల్లోకి రానున్నాయి. ఏయే దేశాలు అమెరికా పౌరులు స్వదేశానికి రాకుండా అడ్డుకుంటున్నాయో హోంల్యాండ్ సెక్యురిటీ అధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటారు. 2020 డిసెంబర్ 31 వరకు ఆయా దేశాలపై ఈ ఆంక్షలు కొనసాగుతాయి. అదే క్రమంలో అమెరికాలో ఉంటూ నిబంధనలు అతిక్రమించిన విదేశీయులను వారివారి దేశాలకు పంపిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇక తమ పౌరులకు వీసాల మంజూరులో ఇబ్బందులు కలిగించలేదని హోంల్యాండ్ సెక్యురిటీ అధికారులు భావించిన దేశాలపై వీసాల ఆంక్షలు తొలగిస్తారు.
(చదవండి: లక్ష దాటిన కోవిడ్ మరణాలు)
Comments
Please login to add a commentAdd a comment