ఇస్తాంబుల్: అగ్రరాజ్యం రష్యా విధించిన ఆంక్షలతో టర్కీ దేశం ఆర్థికంగా కుదేలవుతోంది. రష్యా ఆంక్షల కారణంగా ఇప్పటికే దాదాపు రూ. 60 వేల కోట్లను నష్టపోయినట్లు ఆదేశ ఉప ప్రధాని మెహ్మత్ సింసెక్ వెల్లడించారు. ఆహారోత్పత్తులపై నిషేధం విధించడంతో పాటు టూరిజంపై ఆంక్షలు టర్కీపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. టర్కీకి కావలసిన ఇంధన వనరులు ముఖ్యంగా రష్యా నుంచే అందేవి. 55 శాతం సహజ వాయువు, 35 శాతం ఇంధనం రష్యా నుంచే టర్కీ పొందేది. రష్యా ఆంక్షలతో ప్రత్యామ్నాయ మార్గాలపై టర్కీ ప్రభుత్వం దృష్టి సారిస్తున్నా.. అవి ఆశించినంత ఫలితాన్ని ఇవ్వడం లేదు.
తమ ఫైటర్ జెట్ విమానాన్ని సిరియా సరిహద్దులో టర్కీ వైమానిక దళం కూల్చివేయటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. టర్కీపై ఆంక్షలు విధించారు. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంత అధ్వాన్నంగా ఉన్నాయి. విమానం కూల్చివేత ఘటనను సీరియస్గా తసుకున్న రష్యా.. తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే.
రష్యా ఆంక్షలతో టర్కీ కుదేలు
Published Mon, Dec 7 2015 6:21 PM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM
Advertisement
Advertisement