ఎవరి భార్య ఎవరో తెలియక తికమక! | twin pairs will go for a plastic surgery in china | Sakshi
Sakshi News home page

ఎవరి భార్య ఎవరో తెలియక తికమక!

Published Fri, Apr 8 2016 8:22 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

ఎవరి భార్య ఎవరో తెలియక తికమక!

ఎవరి భార్య ఎవరో తెలియక తికమక!

బీజీంగ్: వారిద్దరూ ట్విన్ సిస్టర్స్. వారు పెళ్లాడింది ట్విన్ బ్రదర్స్ను. అక్కడిదాకా బాగానే ఉంది కానీ ఆ తరువాతే మొదలైంది అసలు కథ. చూడటానికి అచ్చుగద్దినట్లు ఒకేలా ఉండే ఆ జంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏ మాత్రం పొరపాటు జరిగినా మొదటికే మోసం వస్తుందని గ్రహించిన ఆ జంటలు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించి వారి రూపాలనే మార్చుకోవాలనుకుంటున్నారు.

వివారాల్లోకి వెళ్తే.. చైనాలోని షాంజీ ప్రాంతానికి చెందిన ఇద్దరు ట్విన్ సిస్టర్స్ యున్ ఫియ్, యున్ యాంగ్ చూడటానికి ఒకేలా ఉండి అందరినీ తికమక పెట్టేవారు. అయితే ఆశ్చర్యంగా వారి ఊరికి సమీపంలోని మరో ఉళ్లో అచ్చం ఒకేలా ఉన్న ట్విన్ బ్రదర్స్ ను వారు ముచ్చటపడి పెళ్లాడారు. ఫిబ్రవరి 15న జరిగిన ఈ జాయింట్ వెడ్డింగ్ కార్యక్రమంలో ఒకరి ఫియాన్సీని మరోకరు కాకుండా ఎలాగోలా కరెక్టుగానే పెళ్లాడారు.

వివాహానంతరం చూడటానికి అచ్చం ఒకేలా ఉన్న జంటలకు ఎవరి భర్త ఎవరు? ఎవరి భార్య ఎవరు? అనే విషయం వారికి కనిపెట్టడం కష్టంగా మారుతోంది. దీనికి తోడు కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం ఒకరనుకొని మరొకరితో మాట్లాడుతుండటంతో చిరాకుపడి దీనికి పరిష్కారం కనుగొనాలని సూచించారు. ఏం చేయాలో బాగా ఆలోచించిన ఈ జంటలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం వీరిని పరిశీలించిన వైద్యులు ముఖాల్లో చిన్న మార్పులు చేయడం ద్వారా వీరి సమస్యకు పరిష్కారం చూపుతామంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement