ట్విట్టర్ నుంచి ఆప్షన్ తొలగింపు | twitter removing vine option | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ నుంచి ఆప్షన్ తొలగింపు

Published Thu, Oct 27 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

ట్విట్టర్ నుంచి ఆప్షన్ తొలగింపు

ట్విట్టర్ నుంచి ఆప్షన్ తొలగింపు

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఖాతాదారులకు అందించే సేవల నుంచి మరో ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఖాతాదారులకు అందించే సేవల నుంచి మరో ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. వైన్ ఆప్షన్‌ను త్వరలో తొలగించేందుకు నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆప్షన్ ద్వారా షార్ట్ ఫామ్ వీడియో షేరింగ్ సర్వీసును అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాతాదారులు ఈ వైన్ ఆప్షన్‌తో వీడియోలను షేర్, డౌన్‌లోడ్ చేసేందుకు  వినియోగిస్తున్నారు.

ట్విట్టర్ ఖాతాదారులకు వైన్ ఆప్షన్ ద్వారా విలువైన సేవలను అందిస్తోందని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక కారణాలు, పని భారంతో పాటు ప్రధాన పొటీదారులైన ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ నుంచి పోటీని తట్టుకోలేక ఇప్పటికే 9 శాతం ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ట్విట్టర్ను విక్రయించడానికి సన్నద్ధమైన కొనుగోలు చేసేందుకు ఏ కంపెనీ కూడా ముందుకు రాని విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement