ఈ ఫొటోలోని వాచీలు చూశారు కదా.. ఇవి వెరైటీకి పర్యాయపదం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి వాచీలను ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండరు. ఇంత వెరైటీగా వీటిని ఎవరు తయారు చేశారా అని సందేహం మీకు వెంటనే వచ్చింది కదూ! జపాన్‌కు చెందిన ఫ్రిస్క్ పీ అనే ఓ డిజైనర్ ఈ వెరైటీ రిస్ట్ వాచీలను తయారు చేసింది. ఆమెకు వాచీలను తయారు చేయాలనే కోరిక ఉంది. అయితే అలాంటిలాంటి వాచీలు కాదట.. కనీసం ప్రపంచంలో ఆమె తయారు చేసినవి మరెక్కడా తయారు కానివి... కనీసం ఎవరూ చూసి ఉండకూడదని నిశ్చయించుకుందట. అనుకున్నదే తడవు.. ఇదిగో ఇలాంటి వాచీలను తయారు చేసిందట. వీటిని తయారు చేసేందుకు త్రీడీ క్యాడ్, ఫ్యూజన్ 360 వంటి అనేక సాంకేతికతలను వాడుకుంటుందట. నిజానికి అవి వాడేందుకు పనికి రాకపోవచ్చు. కానీ వెరైటీ కోరుకునే వారికి ఇలాంటివి బాగా నచ్చుతాయి.
Comments
Please login to add a commentAdd a comment