
ఇక యూట్యూబ్ నుంచే షేరింగ్
యూట్యూబ్‌లో వీడియోలను చూడడమే కాదు.. ఇకపై చూసిన వీడియోల్లో నచ్చినవాటిని, నచ్చినవారికి షేర్ కూడా చేయవచ్చు.
కెనడా: యూట్యూబ్‌లో వీడియోలను చూడడమే కాదు.. ఇకపై చూసిన వీడియోల్లో నచ్చినవాటిని, నచ్చినవారికి షేర్ కూడా చేయవచ్చు. ఈ సరికొత్త సదుపాయాన్ని యూట్యూబ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటిదాకా యూట్యూబ్ వీడియో మనకు నచ్చిన వీడియోలను ఇతరులకు పంపించాలనుకుంటే మరో యాప్‌పై ఆధారపడాల్సి వచ్చేది. ఇక నుంచి ఆ ఇబ్బంది లేకుండా యూట్యూబ్ నుంచే ఆ పని చేసుకోవచ్చు.
ఇది వరకు కెనడాలో మాత్రమే దీన్ని విడుదల చేయగా.. మంగళవారం నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. గతేడాది నుంచే దీన్ని పరిశీలిస్తున్నామని, వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పలు మార్పులు చేర్పులూ చేశామని యూట్యూబ్ పేర్కొంది. ఇకపై యూట్యూబ్ వీడియోలను నేరుగా మీ స్నేహితులు, కుటుంబసభ్యులతో యూట్యూబ్ యాప్‌లోనే పంచుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాదు ఆ వీడియో గురించి యాప్‌లోనే చర్చించుకోవచ్చని తెలిపింది. త్వరలో అందించే అప్‌డేట్ ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.