
వీసా దుర్వినియోగాలపై విచారణ: ట్రంప్
అధికారం చేపట్టగానే దర్యాప్తునకు ఆదేశాలు
వాషింగ్టన్: వీసా దుర్వినియోగాలకు సంబం ధించి వచ్చిన అన్ని రకాల అభియోగాలపై తాను అధికారం చేపట్టిన తర్వాత విచారణ జరిపిస్తానని అమెరికా నూతన అధ్యక్షునిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికన్లకు ఉద్యోగాలను దూరం చేస్తున్న ఇలాంటి దుర్వినియోగాలపై దర్యాప్తు జరపాలని తాను అధికారం చేపట్టిన తర్వాత కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు. దీంతో ట్రంప్ పాలనలో భారతీయులు సహా విదేశాలకు చెందిన కార్మికులు వీసాలకు సంబంధించి కఠినమైన పరిశీలనను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అయితే వీసా ఆరోపణలకు సంబంధించి ఏ ఒక్కరి పేరును ట్రంప్ ప్రస్తావించలేదు.
గత కొన్నేళ్లుగా పలు కంపెనీలు హెచ్1బీ వీసాల దుర్వినియోగానికి పాల్పడుతున్నాయంటూ చట్ట సభల సభ్యులు ఆం దోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ వలస విధానాలను కట్టుదిట్టం చేస్తామని ప్రకటించారు. భారత్, చైనా లాంటి దేశాలకు కంపెనీలు ఉద్యోగాలను బదలారుుస్తున్నాయని ఆరోపించారు. మిషిగన్‌లో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
విదేశాంగ మంత్రిగా రెక్స్ టిల్లర్‌సన్?
డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలో ఎక్సాన్ మొబిల్ సీఈవో రెక్స్ టిల్లర్‌సన్‌కు విదేశాంగ మంత్రి పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పదవికి రేసులో టిల్లర్‌సన్ ముందు వరుసలో ఉన్నారు. అయితే ఇద్దరు రిపబ్లికన్ పార్టీ టాప్ సెనేటర్లు మాత్రం టిల్లర్‌సన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టిల్లర్‌సన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందువల్ల ఆయన అభ్యర్థిత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే విదేశాంగ మంత్రి ఎంపికకు సంబంధించిన ప్రకటన ఈ వారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.