
చేపను వాకింగ్‌కు తీసుకెళ్దామా?
కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లేవాళ్లున్నారు.. మరి చేపలను? అవును మరి.. ఇంట్లో ఉండీ ఉండీ దానికీ బోర్ కొడుతుంది కదా.. ఇలాంటి తిక్క ఆలోచనలు వచ్చేవాళ్ల కోసమే ఈ పరికరం..
కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లేవాళ్లున్నారు.. మరి చేపలను? అవును మరి.. ఇంట్లో ఉండీ ఉండీ దానికీ బోర్ కొడుతుంది కదా.. ఇలాంటి తిక్క ఆలోచనలు వచ్చేవాళ్ల కోసమే ఈ పరికరం.. పేరు అక్వాటిక్ ప్రామ్. బ్రిటన్‌లోని వెస్ట్‌యార్క్‌షైర్‌కు చెందిన మైక్ వారెన్ అనే వ్యక్తి దీన్ని రూపొందించాడు. తన పెంపుడు చేప మాల్కం కోసం దీన్ని తయారుచేశాడు. మాల్కం చనిపోయింది. పరికరం మిగిలిపోయింది. తనలాగే తమ పెంపుడు చేపలను వాకింగ్‌కు తీసుకెళ్లాలనుకునేవాళ్లు చాలా మంది ఉంటారని మైక్ చెబుతున్నాడు. అందుకే.. భారీ స్థాయిలో దీని ఉత్పత్తి చేపట్టాలని యోచిస్తున్నాడు.