మీడియా టైకూన్‌ మాజీ భార్యతో పుతిన్‌ డేటింగ్‌! | Vladimir Putin dating Rupert Murdoch ex wife Wendi Deng? | Sakshi
Sakshi News home page

మీడియా టైకూన్‌ మాజీ భార్యతో పుతిన్‌ డేటింగ్‌!

Apr 1 2016 3:13 PM | Updated on Sep 3 2017 9:01 PM

మీడియా టైకూన్‌ మాజీ భార్యతో పుతిన్‌ డేటింగ్‌!

మీడియా టైకూన్‌ మాజీ భార్యతో పుతిన్‌ డేటింగ్‌!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మళ్లీ ప్రేమదోమ కుట్టినట్టు కనిపిస్తోంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మళ్లీ ప్రేమదోమ కుట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా షికార్లు చేస్తున్న రుమర్ల ప్రకారం ఆయన మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోర్‌ మాజీ భార్య వెండి డెంగ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. 2013లో భార్య ష్క్రెబ్‌నెవాకు విడాకులు ఇచ్చింది మొదలు రష్యా నేత పుతిన్ చుట్టూ నిత్యం వదంతులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆయన ఇప్పటికే రిథమిక్ జిమ్నాస్ట్‌ ఎలీనా కబేవాతో, టాప్ మహిళా బాక్సర్ నటాలియా రగొజినాతో ప్రేమాయణం సాగించినట్టు వార్తలు వచ్చాయి.

రూపర్ట్ మర్డోక్‌ మూడో భార్య అయిన వెండీ డెంగ్‌ 2013లో భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె కొంతకాలం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో ప్రేమాయణం సాగించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం ఆమె పుతిన్‌తో గాఢమైన ప్రేమలో మునిగిపోయిందట. ఈ ఇద్దరూ సీరియస్‌గా రిలేషన్‌షిప్ మెయింటేన్ చేయాలని నిర్ణయించుకున్నట్టు యూఎస్‌ వీక్లీ తెలిపింది. 'డెంగ్‌ ఇంతవరకు పుతిన్‌తో కలిసి మీడియా కంటికి కనిపించలేదు. కానీ ఇప్పటికే పుతిన్ సన్నిహిత మిత్రుడైన రోమన్ అబ్రామొవిచ్‌తో కలిసి ఆమె విమానంలో ప్రయాణించింది' అని ఆ పత్రిక వెల్లడించింది. గతంలోనూ డెంగ్, పుతిన్ డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా వస్తున్న కథనాలు నిజమైతే త్వరలోనే రష్యా అధ్యక్షుడు మరో లగ్గానికి సిద్ధమైనట్టేనని చెప్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement