
మల్టీప్లెక్స్‌లంటే మక్కువ తక్కువే!
నేటికాలంలో దేశంలోని అనేక పట్టణాల్లో మల్టీప్లెక్స్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
న్యూయార్క్: నేటికాలంలో దేశంలోని అనేక పట్టణాల్లో మల్టీప్లెక్స్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువ స్క్రీన్స్‌తో ఉండే ఇవి సినిమా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటి సంఖ్య ఇంతగా పెరుగుతున్నా మన దేశంలో మల్టీప్లెక్స్‌లకంటే సాధారణ థియేటర్లవైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. పెద్ద పట్టణాల్లో కొత్తగా ఏ నిర్మాణం చేపట్టాలన్నా స్థలం దొరకడం సమస్యగా మారింది.
అలాగే భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో తక్కువ స్థలంలోనే మల్టీప్లెక్స్ నిర్మాణాలు చేపట్టే వీలుండడంతో ఇవి ఎక్కువగా వెలుస్తున్నాయి. ఇందులో సినిమా స్క్రీన్లు చిన్నగా ఉంటాయి. ఎక్కువ షోలు ప్రదర్శించే వీలుంటుంది. విద్యావంతులు, సంపన్నులు సినిమాలు చూడడానికి మల్టీప్లెక్స్‌లకే వెళ్తున్నారు. వీరు మినహా మిగతా ప్రాంతాలవారు, ఇతర వర్గాలవారు మాత్రం సాధారణ థియేటర్లవైపే మొగ్గు చూపుతున్నారు.