
వాషింగ్టన్ : యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మట్టిస్ తమ బలగానికి స్పష్టం చేశారు. గత కొద్ది కాలంగా రష్యా, చైనా నుంచి వరుసగా బెదిరింపులు వస్తున్నాయని వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కొత్త రక్షణ వ్యూహాన్ని సిద్ధం చేయాలని పెంటగాన్ భావిస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
'చైనా, రష్యావంటి పలు దేశాల నుంచి బెదిరింపులను మనం కొంత కాలంగా ఎదుర్కొంటున్నాము. ఇటీవల అమెరికా సైనిక సామర్థ్యంలో మార్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇప్పటికీ మన సైన్యం బలమైనదే. గగనతలంలోనూ, ఉపరితలంలోనూ, అంతరిక్షంలోనూ, సైబర్ స్పేస్‌లోను మన ఆదిపత్యం ఉన్నప్పటికీ అది నానాటికీ కొంత తగ్గుతూ వస్తోంది. గత కొంత కాలంగా సరైన బడ్జెట్ కేటాయింపులు చేయని కారణంగా అమెరికా సైన్యం ఇబ్బంది పడుతోందని డోనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే మరోసారి మొత్తం సైనిక శక్తిని పటిష్టం చేసి పునరుత్తేజం చేయాల్సిన అవసరం ఉంది' అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment