వైట్‌హౌస్‌లో ఆయన మోదీని ఆదుకున్నారట!
అమెరికాలో పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్న ఇబ్బందిలో చిక్కుకున్నారట.
వాషింగ్టన్: అమెరికాలో పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్న ఇబ్బందిలో చిక్కుకున్నారట. వైట్హౌస్‌లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా చల్లగాలి ఆయనతో కొంటెగా ఆడుకుందట. అయితే అక‍్కడే ఉన్న జాతీయ భద్రతా సలహాదారుడు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ చురుగ్గా వ్యవహరించి మోదీ ప‍్రసంగంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా వ్యవహరించారు.
రోజ్ గార్డెన్లో మొదటిసారి అమెరికా ప్రెసిడెన్షియల్ మాన్షన్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని ప్రధాని మోదీ శ్రద్ధగా వింటుండగా.. మోదీ ప్రసంగానికి సంబంధించి తయారుచేసిన పేపర్లు సడెన్ వచ్చిన గాలికి ఎగిరిపోయాయి. దీంతో ఇతర సీనియర్ అధికారులతో కలిసి ముందు వరుసలో కూర్చున్న దోవల్ వాటికి దొరకబుచ్చుకోవడంతోపాటు, వెంటనే దానిని తిరిగి ప్రధాన మంత్రికి అందజేశారు. అయితే గాలి మళ్లీ అదే కొంటె పనిచేయడంతో తిరిగి పేపర్లను క్రమంలో పెట్టి మరీ మోదీకి అందించారు.