
వెంటాడి.. వేటాడి!
‘వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది’ అంటారు.. ఈ చిత్రాన్ని చూస్తే సరిగ్గా అదే సామెత గుర్తుకు వస్తోంది కదూ! అడవిలో తనకు ఎదురే లేదని విర్రవిగే బూమ్‌స్లాంగ్ అనే విషసర్పాన్ని ఓ ముంగిస వేటాడింది. చెట్టు చిటారుకొమ్మన విశ్రమిస్తున్న ఆ పాము వీపుపైనే ఎక్కి తలను నోట కరిచి చంపేసింది. పాపం! ఏనుగులు, మనుషులను ఒక్క కాటుతో మట్టుబెట్టే సర్పాన్ని తన వాడైన పళ్లతో ముంగిస కరకరా నమిలేసింది. నమీబియాలోని ఎస్తోషా నేషనల్ పార్కులోనిదీ దృశ్యం.