ఐఫోన్లతో ఇల్లు కొనేసింది! | Woman Makes 20 Boyfriends Buy Her an iPhone 7 Each, Then Sells Them to Buy a House | Sakshi
Sakshi News home page

ఐఫోన్లతో ఇల్లు కొనేసింది!

Published Wed, Nov 2 2016 12:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

ఐఫోన్లతో ఇల్లు కొనేసింది!

ఐఫోన్లతో ఇల్లు కొనేసింది!

బుర్రలో విషయం ఉన్నోళ్లు ఏడారిలో సైతం ఇసుక అమ్మగలరు. అతితెలివి తేటలున్నోళ్లు తిమ్మిని బమ్మిని చేసేసి బతికేస్తుంటారు. చైనాలో ఓ అమ్మడు ఐఫోన్లతో ఏకంగా ఇల్లు కొనేసింది. బాయ్ ఫ్రెండ్స్ ఇచ్చిన ఐఫోన్లను అమ్మేసి ఏంచక్కా సొంతిల్లు సమకూర్చుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సహోద్యోగి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. చైనాలో ఐఫోన్లు బహుమతిగా ఇచ్చి ప్రేమను వ్యక్తం చేయడం పిచ్చిగా మారిందనడానికి ఈ ఉదంతం అద్దం పడుతోంది.

షియోలీ(ఇది అసలు పేరు కాకపోవచ్చు) అనే యువతి తన దగ్గర ఉన్న 20 ఐఫోన్లను ఆన్ లైన్ లో అమ్మేసి సుమారు 12 లక్షల రూపాయలు పోగేసింది. ఈ డబ్బును డౌన్ పేమెంట్ గా చెల్లించి ఇల్లు కొక్కుకుంది. షియోలీకి 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె సహద్యోగి ఒకరు 'తియాన్ యా యి డూ' బ్లాగ్ ద్వారా ఫ్రౌడ్ ఖియొబా పేరుతో వెల్లడించాడు. వాళ్లందరి నుంచి ఐఫోన్ 7 గిఫ్ట్ గా ఆమె తీసుకుందని తెలిపాడు. చైనాకు వలసవచ్చిన కుటుంబంలో జన్మించిన ఆమె ముందుచూపుతోనే ఇల్లు కొనుక్కుని వుండొచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే ఆమె ఇల్లు కొనుక్కున్న పద్ధతే తనకు నమ్మశక్యంగా లేదని ఆశ్చర్యపోయాడు. ఈ విషయం గురించి తెలియగానే షియోలీ కొనుకున్న ఇల్లు చూడాలని, ఆమె డబ్బు ఎలా కూడబెట్టిందో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరిచారని వెల్లడించాడు.

షియోలీని ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వెంటపడింది. అయితే మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించింది. షీయోలీ స్టోరీ '20 మొబైల్స్ ఫర్ ఏ హౌస్' హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేశారు. కొంతమంది ఆమెను ప్రసంసిస్తే, మరికొంత మంది ఆమె చేసిన పని కరెక్ట్ కాదని తిట్టిపోశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement