ఉగ్రవాద వ్యతిరేక పోరుపై మోదీ
జోర్డాన్, ఈజిప్టు, శ్రీలంక సహా పలువురు దేశాధినేతలతో భేటీ
న్యూయార్క్: ఉగ్రవాదాన్ని మతంతో ముడిపెట్టకుండా వేరు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇస్లామిక్ స్టేట్ వంటి సంస్థలు ప్రేరేపిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమర్థవంతంగా పోరాడాలంటే ప్రపంచ స్థాయి ప్రతిస్పందన అవసరమని ఉద్ఘాటించారు. శుక్రవారం ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా మోదీ జోర్డాన్ రాజు అబ్దుల్లాతో సమావేశమై చర్చలు జరిపారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై ప్రపంచం ఒకే గొంతుతో మాట్లాడాల్సిన సమయం.. దీనిపై సమగ్ర ప్రపంచ సదస్సును నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ పేర్కొన్నారు.
రాగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసితో మోదీ సమావేశమై సూయజ్ కాల్వ ప్రాజెక్టులో భారత పెట్టుబడులకు అవకాశాలపై చర్చించారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాలతో జరిపిన భేటీలో.. లంక తమిళుల విషయంలో ఐక్యతా ప్రక్రియపై చర్చలు జరిపారు. స్వీడన్ ప్రధాని స్టెఫాన్ లాఫ్వెన్‌తోనూ మోదీ చర్చలు జరిపారు. శాంతి పరిరక్షణ ఆపరేషన్లలో.. అధిక సంఖ్యలో దళాలను పంపిస్తున్న భారత్ వంటి దేశాలతో సంప్రదింపులు లేకపోవటంపై ఐరాస చీఫ్ బాన్ కి-మూన్‌తో మోదీ చర్చించారు.
ఈ విషయంలో నిర్ణయాలు తీసుకునే విధానంలో మార్పు రావాలన్నారు. మోదీ ప్రారంభించిన సంస్కరణలు.. భారత్ వైపు ప్రపంచం చూసే దృష్టిపై భారీ ప్రభావం చూపాయని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ మోదీతో భేటీలో పేర్కొన్నారు. కాగా, సాన్ జోస్‌లోని సిలికాన్ వ్యాలీలో టెస్లా మోటార్స్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్, అడోబ్ తదితర ప్రఖ్యాత కంపెనీల అధినేతలతో మోదీ భేటీ కానున్నారు.
ప్రపంచం స్పందించాలి
Published Sun, Sep 27 2015 4:24 AM | Last Updated on Fri, Aug 24 2018 1:52 PM
Advertisement
Advertisement