
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ నమూనా ఇది. జత ధర అక్షరాలా రూ.123కోట్లు. అంత నగదు చెల్లించి సొంతంచేసుకున్న తర్వాత కొనుగోలుదారునికి సైజు తగ్గట్లుగా అచ్చం ఇదే డిజైన్‌లో తయారుచేసి ఇస్తారు. వందలాది చిన్నచిన్న వజ్రాలు, ముందుభాగంలో 15 కేరట్ల బరువైన రెండు పెద్దవజ్రాలను అమర్చి, మేలిమి బంగారంతో వీటిని తయారుచేయనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని బుర్జ్ అల్ అరబ్ హోటల్‌లో బుధవారం వీటి నమూనాను ఆవిష్కరిస్తారు.