స్కూల్లో యోగాకు అమెరికా కోర్టు సమర్థన
లాస్ఏంజెల్స్ : యోగా అనేది మతపరమైన కార్యక్రమం కాదు, శారీరక కసరత్తుగానే భావించాలంటూ లాస్ఏంజెల్స్ కోర్టు తీర్పునిచ్చింది. స్కూల్లో యోగా నేర్పించడం మతపరమైన హక్కులను ఉల్లంఘిచినట్టు కాదని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.
యోగాతో హిందూ, బౌద్ధ మతాలను ప్రోత్సహిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. దీంతో అమెరికా స్కూళ్లలో యోగా బోధనకు ఎలాంటి ఇబ్బంది లేనట్లయింది. హిందూ మతాన్ని స్కూళ్లలో విద్యార్థులపై రుద్దుతున్నారని కొందరు వాదించారు. ఆ వాదనను కోర్టు కొట్టేయడంతో యోగా టీచర్లకు ఊరట కలిగింది.