యువకుడిని గాల్లోకి బంతిలా ఎగరేసి.. | Youngster tossed into the air by 62-stone bull and gored in front of helpless onlookers | Sakshi
Sakshi News home page

యువకుడిని గాల్లోకి బంతిలా ఎగరేసి..

Published Tue, Jul 26 2016 6:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

యువకుడిని గాల్లోకి బంతిలా ఎగరేసి..

యువకుడిని గాల్లోకి బంతిలా ఎగరేసి..

మెక్సికో: బుల్ ఫైట్ పోటీ నిర్వహిస్తుండగా మధ్యలో వెళ్లిన ఓ యువకుడిని వెనుక నుంచి వచ్చిన ఎద్దు కొమ్ములతో గాల్లోకి విసిరేసింది. దాంతో అతడు కొన్ని మీటర్ల ఎత్తు లేచి కిందపడి స్పృహకోల్పోయాడు. అంతటితో వదిలిపెట్టని ఆ ఎద్దు మరోసారి వెనక్కు వచ్చి పడిపోయిన అతడిని పదేపదే పొడిచి రక్తపు మడుగులో పడేసింది. దీంతో అతడి తలకు, వీపునకు తీవ్రగాయాలయ్యాయి. ప్రాణాపాయం మాత్రం తప్పింది. మెక్సికోలోని జికో అనే పట్టణంలో ఓ వీధిలో బుల్ ఫైట్ నిర్వహిస్తున్నారు.

ఆ పక్క ఈ పక్క మనుషులు నిల్చొని గోలగోల చేస్తున్నారు. అదే సమయంలో బుల్స్ను నియంత్రించేందుకు కొందరు యువకులు ప్రయత్నిస్తున్నారు. అవతలి వైపు ఉన్న ఓ యువకుడు ఓ ఎద్దును నియంత్రించే ప్రయత్నం చేసేలోగా వెళ్లిపోయింది. దాని వైపే చూస్తూ అతడు అవతలికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన 400 కేజీల బుల్ కాస్త బలంగా కొమ్ములతో ఢీకొట్టి గాల్లోకి విసిరేసింది. అక్కడ ఉన్నవారంతా ఆ సంఘటన విషయంలో ప్రేక్షక పాత్ర వహిస్తూ తమ మొబైల్ ఫోన్స్ లో బందించారే తప్ప ఏం చేయలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement