
దొడ్డబళ్లాపురం: జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు బీ మునేగౌడ తన పుట్టినరోజు సందర్భంగా రెండు నెలల క్రితం తాలూకాలోని సొణ్ణపనహళ్లిలో వేయించిన రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు మొత్తం కొట్టుకుపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు సదరు రోడ్డుమీద రాగిపైరు నాటి వినూత్నంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సొణ్ణపనహళ్లి గ్రామపంచాయతీ సభ్యుడు రమేశ్, గ్రామస్తులు చంద్రప్ప, ఆనంద్, నంజేగౌడ జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు బీ మునేగౌడ మాట్లాడుతూ... ప్రచారం కోసం ఇలాంటి నాసిరకం పనులతో రోడ్డు వేయించారని ఆరోపించారు.
రూ.60 లక్షలతో రోడ్డు వేయించానని చెప్పుకునే మునేగౌడ గ్రామానికి వచ్చి పనులు జరిగిన విధానం ఒక్కసారి చూడాలన్నారు.వే సిన రెండు నెలలకే రోడ్డు తేలిపోయిందంటే ఏమాత్రం నాణ్యతతో రోడ్డు వేసారో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. తక్షణం రోడ్డు రిపేరీ చేయించాలని లేదా ఇకపై ప్రచారం కోసం ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. ధర్నాలో హాజరైన గ్రామస్తులు మునేగౌడకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment