
ప్రతీకాత్మక చిత్రం
నేను ఓ పల్లెటూరి అబ్బాయిని! 2016లో కడప జిల్లాలో డాక్టర్స్ కాలేజీలో టెక్నికల్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను. డాక్టర్ కోర్స్ చదువుతున్న ఓ అమ్మాయి తరచూ నా వద్దకు వస్తూ మాట్లాడేది. నాకు అది ప్రేమ అని తెలియదు. ఫ్రెండ్ అనే ఉద్ధేశంతో మాట్లాడేవాడిని. ఒక రోజు ఇంటికి వెళ్తున్నా అని చెప్పి నా నెంబర్ తీసుకుని వెళ్లింది. అప్పటి నుంచి వాట్సాప్ చాట్ చేయటం మొదలుపెట్టింది. ఒక నెల తర్వాత ‘ నేను మళ్లీ కాలేజీకి వస్తున్నా. పికప్ చేసుకోవటానికి రా’ అని పిలిచింది. నేను వెళ్లాను. బైక్‌లో వస్తున్నపుడు నన్ను కౌగిలించుకుని ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పింది. నాకు అది కొత్త ఫీలింగ్ కాబట్టి సరే అని ఒప్పుకున్నాను. తనకి మనీ ప్రాబ్లెమ్ ఉందని 2 రోజుల తర్వాత చెప్పింది.
‘నువ్వు నన్ను మా నాన్నలా చూస్కో రా! నువ్వంటే నాకు ప్రాణం’ అని అంది. ‘ సరే నేను నిన్ను చదివిస్తాను’ అని మాటిచ్చాను. 3 సంవత్సరాలు గడిచింది. మా ఇంట్లో అందరికి తనే ఫోన్ చేసి ‘నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పింది. వాళ్ల ఇంట్లో వాళ్లకి కూడా మనీ అవసరం అయినప్పుడు ఇచ్చే వాడిని. ఇలా ఉన్న నా జీవితంలో ఊహించని సంఘటనలు చూడాల్సి వచ్చింది. అది ఏమిటంటే ఒక రోజు తను రాత్రి ఫోన్ చేసి ‘నాకు నువ్వు వద్దు! ఇకమీదట ఫోన్ చేయకు’ అని చెప్పి కాల్ కట్ చేసింది. మేము అప్పటికే చాలా దగ్గరయ్యాం. ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నాం. ఇదంతా తను కావాలనే చేసింది.
నన్ను తన గ్రిప్‌లో పెట్టుకుని, సడన్‌గా ఎందుకు విడిపోవాలి అనుకుంటోంది అని నాకు అనుమానం వచ్చింది. ‘నేనే ఫోన్ తీసి ఇచ్చానుగా నా ఫోన్ ఇచ్చేయ్!’ అని లాక్కొని వాట్సాప్ ఓపెన్ చేసి చెక్ చేశాను. తను డార్లింగ్ అని ఒక నెంబర్ సేవ్ చేసుకుని ఉంది. చాట్ మొత్తం చదివాను. అందులో ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించమని బ్రతిమలాడుతూ మెసేజ్‌లు ఉన్నాయ్. ఎవరో అని ఆ నెంబర్‌కి కాల్ చేశాను. తీరా చూస్తే ఆయన వాళ్ల ప్రొఫెసర్! అతనికి పెళ్లి అయి ఒక బాబు కూడా ఉన్నారు. అతనికి కాల్ చేసి అడిగాను ఆయన ‘ తప్పు చేస్తున్నావని నేను ఆ అమ్మాయికి చాలా సార్లు చెప్పాను. ఇలాంటివి చేయకు బుద్దిగా చదువుకో అని వార్నింగ్ కూడా ఇచ్చాను.’ అని చెప్పారు.
సార్ తప్పు లేదని తెలిసి. తనను అడిగాను ‘నాకు తను కావలి! అతనికి నీ కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి’ అని అంది. వాళ్ల అమ్మకి కాల్ చేసి చెప్పాను. ‘మీ అమ్మాయి చాలా తప్పు చేస్తోంది’ అని అప్పుడు వాళ్ల అమ్మ ‘నా కూతురు ఎవరితో ఉంటే నీకెందుకు?’ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. మొత్తం కుటుంబం అంతా నన్ను డబ్బుల కోసం ప్రేమ అనే ఎమోషన్‌తో నా జీవితం అంతా నాశనం చేశారు. నేను గడ్డం పెంచుకుని దేవదాస్‌లాగా తిరుగుతున్నాను. నా జీవితంలాగా మీ జీవితాలు అవ్వకూడదు. మీరు ప్రేమించే వారిని అంతా స్టడీ చేసిన తర్వాత ప్రేమని కన్ఫర్మ్ చేసుకుని మీ జీవితానికి కొత్త అడుగులు వేయాలని ఆశిస్తున్నాను.
- చందు, తాడిపత్రి
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment