ఆ డైరెక్టర్‌తో మళ్లీ గొడవ? | Tamannaah Acts in Telugu Version Of Queen Movie, Put on Hold? | Sakshi
Sakshi News home page

ఆ డైరెక్టర్‌తో మిల్కీ బ్యూటీ గొడవ?

Apr 18 2018 5:10 PM | Updated on Apr 18 2018 5:30 PM

 Tamannaah Acts in Telugu Version Of Queen Movie, Put on Hold? - Sakshi

హీరోయిన్‌ తమన్నా

హిందీలో మంచి హిట్‌ సాధించిన ‘క్వీన్‌’ సినిమాను ప్రస్తుతం దీన్ని తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తెలుగు వర్షన్‌కు నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆమెకు, నీలకంఠకు మధ్య విభేదాలు వచ్చాయని ఇదివరకే పుకార్లు వచ్చాయి. సెట్స్‌ మీద ఒకరంటే ఒక్కరికి పడటం లేదని సమాచారం. దీంతో తెలుగు రీమేక్‌ ‘క్వీన్‌’ ఆలస్యం అవుతుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ విషయంపై  నిర్మాతలు స్పందించారు.  తమన్నా, నీలకంఠ మధ్య ఎటువంటి గొడవలు లేవు.. సినిమా ఘాటింగ్‌ జరుగుతోందని గతంలో వారు చెప్పారు. 

ప్రస్తుతం మళ్లీ అవే రూమర్స్‌ మళ్లీ తెరపైకి వచ్చాయి. వారి మధ్య తాజాగా విభేదాలు చోటుచేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘క్వీన్‌’ చిత్రం ఘాటింగ్‌ ఆగిపోయిందని పుకార్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. అసలు వీరి గొడవకి కారణం.. క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ అని చెబుతున్నారు. అయితే ఈ ప్రచారంపై చిత్ర యూనిట్‌ స్పందించలేదు.

  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement