
డాన్?
న్యూ స్టోరీ... న్యూ స్క్రీన్‌ప్లే... న్యూ క్యారెక్టరైజేషన్... శర్వానంద్ సినిమా ఒప్పుకోవాలంటే ఈ మూడు కంపల్సరీ.
న్యూ స్టోరీ... న్యూ స్క్రీన్‌ప్లే... న్యూ క్యారెక్టరైజేషన్... శర్వానంద్ సినిమా ఒప్పుకోవాలంటే ఈ మూడు కంపల్సరీ. అఫ్‌కోర్స్ డైరెక్టర్‌కీ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు శర్వానంద్ ఇలాంటి ప్యాకేజ్‌తో ఓ కొత్త సినిమా ఒప్పుకున్నారని సమాచారం. ‘స్వామి రారా, కేశవ’ వంటి వినూత్న చిత్రాలను అందించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని వినికిడి.
మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని కృష్ణానగర్‌లో వినిపిస్తోంది..మాఫియా డాన్‌గా శర్వానంద్ న్యూ లుక్‌లో కనిపించనున్నారట. అది మాత్రమే కాదు... ఇందులో రెండు పాత్రల్లో కనిపిస్తారని ఓ టాక్. అందులో వయసు మళ్లిన పాత్ర ఒకటి అని భోగట్టా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందట.