వెండితెరపై మరో క్రికెటర్ జీవితం..? | Abhishek Bachchan On Yuvaraj Singh Biopic | Sakshi
Sakshi News home page

వెండితెరపై మరో క్రికెటర్ జీవితం..?

Published Wed, Oct 12 2016 10:51 AM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

వెండితెరపై మరో క్రికెటర్ జీవితం..? - Sakshi

వెండితెరపై మరో క్రికెటర్ జీవితం..?

ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్ సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవితాలకు వెండితెర మీద కాసుల పంట పండుతుండటంతో ఆ దిశ మరింత మంది నటులు, దర్శకులు, నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా భారత్లో ఓ మతంగా వెలిగొందుతున్న క్రికెట్.., క్రీడాకారుల జీవితాలకు భారీ రెస్పాన్స్ వస్తుండటంతో మరింత మంది ప్లేయర్స్ లైఫ్ స్టోరీస్ను తెరకెక్కించేందుకు  ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

ఇప్పటికే అజారుద్ధీన్, ఎమ్ ఎస్ ధోనిల జీవిత చరిత్రలు వెండితెర మీద సందడి చేయగా త్వరలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో బాలీవుడ్ యంగ్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ సూపర్ లీగ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అభిషేక్ ' ప్రస్తుతం బాలీవుడ్లో వస్తున్న బయోపిక్స్ అన్నీ.., ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. నాకు వ్యక్తిగతంగా యువరాజ్ సింగ్ జీవితకథ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.

అతడి కెరీర్లో చాలా విషయాలు ఉన్నాయి. వ్కక్తిగతంగా క్రీడాకారుడిగా ఎన్నో ఎత్తు పల్లాలు ఎదుర్కొన్నాడు యువి. అతని జీవితకథ సినిమాగా రూపొందిస్తే మరింత ఇన్స్పైరింగ్గా ఉంటుంది' అంటూ కామెంట్ చేశాడు. మరి అభిషేక్ సూచనలకు ఏ దర్శక నిర్మాతలైన స్పందిస్తారేమో చూడాలి. అభి కూడా ఇంతలా చెప్పాడంటే తాను స్వయంగా యువి పాత్రలో కనిపించేందుకు కూడా రెడీగానే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement