తాగి బార్‌లో గలాటా చేసిన యువనటుడు | Actor Nanduri Uday kiran arrested | Sakshi
Sakshi News home page

తాగి బార్‌లో గలాటా చేసిన యువనటుడు

Published Tue, Jan 12 2016 8:18 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

తాగి బార్‌లో గలాటా చేసిన యువనటుడు - Sakshi

తాగి బార్‌లో గలాటా చేసిన యువనటుడు

కాకినాడ: 'ఫ్రెండ్స్‌ బుక్' సినిమా హీరోల్లో ఒకరైన నండూరి ఉదయ్ కిరణ్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంతకుముందు డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఈ యువనటుడు ఈసారి పీకలదాకా తాగి బార్‌లో నానా హంగామా సృష్టించాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ టూటౌన్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన ఉదయ్ కిరణ్ సోమవారం రాత్రి స్థానిక రాజా ట్యాంకు సమీపంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు.

చిత్తుగా తాగిన అతడు.. తాను సినీ హీరోనని, అసిస్టెంట్ డైరెక్టర్‌నని చెప్పి అర్ధరాత్రి గలాటా సృష్టించాడు. అంతటితో ఆగకుండా రెస్టారెంట్ కిటికీ అద్దాలను ధ్వంసం చేశాడు. బార్ అండ్ రెస్టారెంట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న టూటౌన్ పోలీసులు ఉదయ్ కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉందని ఇన్‌స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ చెప్పారు. ఉద్యోగాలిప్పిస్తానని, సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పి చాలామందిని మోసగించినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement