ఫేస్బుక్లో ప్రభాస్కు 'లైకు'ల వర్షం | Actor Prabhas facebook account showered with thousands of likes | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో ప్రభాస్కు 'లైకు'ల వర్షం

Published Tue, Oct 22 2013 6:07 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్బుక్లో ప్రభాస్కు 'లైకు'ల వర్షం - Sakshi

ఫేస్బుక్లో ప్రభాస్కు 'లైకు'ల వర్షం

హైదరాబాద్: యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ సామాజిక సంబంధాల వెబ్సైట్ ఫేస్బుక్లో సంచలనం సృష్టిస్తున్నాడు. అతడు ఫేస్బుక్లో ఎకౌంట్ తెరిచిన 24 గంటల్లోనే 50 వేలకు పైగా లైకులు వచ్చాయి. వీటి సంఖ్య సెకను సెకనుకు పెరుగుతోంది. ' ఇది నా అధికారిక ఫేస్బుక్ పేజీ. దీనితో అభిమానులకు అందుబాటులో ఉంటా. నా గురించి, నా సినిమాలకు సంబంధించిన సినిమాల సమాచారం ఎప్పటికప్పడు ఆప్డేట్ చేస్తాను' అంటూ ప్రభాస్ తన ఫేస్బుక్ పేజీలో మెసేజ్ పెట్టాడు.

ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' సినిమాలో నటించడం మంచి అనుభవమని పేర్కొన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు దర్శకుడు రాజమౌళి వెళ్లడిస్తారని తెలిపాడు.  'బాహుబలి' టీమ్ పనితీరు అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు.

రేపు(అక్టోబర్ 23) ప్రభాస్ 34వ జన్మదినం జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా 'బాహుబలి' షూటింగ్కు సంబంధించిన నిమిషం నిడివి వున్న టీజర్ను విడుదల చేయనున్నారు. 80 నుంచి 100 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్గా నటిస్తోంది. దగ్గుబాటి రానా, అడవి శేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement