అంతా డిఫరెంట్‌..! | Actor Ram Charan's next to roll from March 20 | Sakshi
Sakshi News home page

అంతా డిఫరెంట్‌..!

Published Mon, Mar 6 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

అంతా డిఫరెంట్‌..!

అంతా డిఫరెంట్‌..!

సుకుమార్‌ సినిమాలు ఎంత ఢిపరెంట్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా కాన్సెప్ట్, హీరో క్యారెక్టరైజేషన్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా ఆయన తెరకెక్కించనున్న సినిమా ఫుల్‌ డిఫరెంట్‌గా ఉంటుందట.  ఈ చిత్రం షూటింగ్‌ ఈ నెల 20న మొదలు కానుంది. ఆ తర్వాత రెండు రోజులకు సమంత జాయిన్‌ అవుతారని సోమవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో సమంతను కథానాయికగా ఎంపిక చేశారు.

కానీ, ఆమె చేయడంలేదనే వార్త రెండు రోజులుగా హల్‌చల్‌ చేస్తోంది. ‘అదేం లేదు’ అని ఈ ప్రకటన నిర్ధారణ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌పై ఈ చిత్రాన్ని ఎర్నెని నవీన్, వై. రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ ఇది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ పాటలు స్వరపరుస్తున్నారు. పల్లెటూరి వ్యక్తిలా చరణ్‌ పంచె కట్టుకుని, కావడి కుండలు మోసుకెళుతున్న లుక్‌ని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.‘‘ఈ ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన వచ్చింది.  ఈ ఏడాది జూలై నాటికి షూటింగ్‌ పూర్తయ్యేలా దర్శకుడు సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా, తమిళనాడులో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది’’ అని నిర్మాతలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement