'అతను అడిగాడు.. నేను ఓకే అన్నాను'
ముంబై: బాలీవుడ్ భామ ఇషా గుప్తా అభిమానులకు మింగుడు పడని వార్త చెప్పింది. ప్రస్తుతం నీరజ్ వోరా దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహంల సరసన 'హిరా ఫెరీ 3'లో నటిస్తోన్న ఈ భామ తన ఎంగేజ్మెంట్ అయిపోయినట్లు సంకేతాలిచ్చింది. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో వేలికి రింగ్ ధరించిన ఫోటోను షేర్ చేసింది. అంతేకాదు ఆ ఫోటోకు క్యాప్షన్‌గా ' అతను అడిగాడు.. నేను ఓకే అన్నాను' అని అభిమానులకు హింట్ ఇచ్చింది. అయితే ఆమెకు ప్రపోజ్ చేసింది ఎవరనే విషయాన్ని మాత్రం ఇషా వెల్లడించలేదు.
దీంతో అభిమానులు ఇంతకీ ఆ అతనెవరో తెలుసుకోవాలని ఇషాకు మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పెడుతున్నారు. కొందరైంతే ' నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. బెస్ట్ ఆఫ్ లక్ ఇషా' అంటూ ఎంగేజ్‌మెంట్‌ను కన్ఫర్మ్ చేసేశారు. గతంలో ఫిల్మ్ మేకర్ పునిత్ మల్హోత్రాతో డేటింగ్ చేసిన ఈ అమ్మడు కొద్ది నెలల క్రితమే అతనికి బైబై చెప్పినట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ 'అతడు' ఎవరనేది తెలియాలి మరి.