అల్లాటప్పా పాత్రలు చేయను | actress varalaxmi sarath kumar said i dont do ordinory carectres | Sakshi
Sakshi News home page

అల్లాటప్పా పాత్రలు చేయను

Apr 15 2016 3:30 AM | Updated on Sep 3 2017 9:55 PM

అల్లాటప్పా పాత్రలు చేయను

అల్లాటప్పా పాత్రలు చేయను

అల్లాటప్పా పాత్రలు చేయనంటున్నారు నటి వరలక్ష్మీశరత్‌కుమార్. పోడా పోడీ అంటూ శింబుకు జంటగా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈ..

నటి వరలక్ష్మిశరత్‌కుమార్
అల్లాటప్పా పాత్రలు చేయనంటున్నారు నటి వరలక్ష్మీశరత్‌కుమార్. పోడా పోడీ అంటూ శింబుకు జంటగా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ తొలి చిత్రంలోనే అందాలారబోతలో ఇరగదీసి యూత్‌ను గిలిగింతలు పెట్టారు. బెల్లీ డాన్స్‌తో జిగేల్ మన్నారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో అవకాశాలు స్పీడ్ అందుకోలేదు. ఆ తరువాత విశాల్‌తో రొమాన్స్ చేసిన మదగజరాజా చిత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే విశాల్‌తో సాన్నిహిత్యం పెరిగిందనీ, వారిద్దరు ప్రేమించుకుంటున్నారనే వదంతులు జోరుగా సాగాయి.

ఏదేమైనా చాలా గ్యాప్ తరువాత అందిపుచ్చుకున్న చిత్రం తారైతప్పట్టై. బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గరకాటకారి పాత్రలో వరలక్ష్మి దుమ్మురేపారు. ఫలితం చిత్రం విజయం సాధించకపోయినా వరలక్ష్మి ఎలాంటి పాత్రలోనైనా సత్తా చాటగలదన్న పేరును సంపాదించుకున్నారు. తాజాగా అవకాశాలు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం అర్జున్‌తో నిపుణన్ చిత్రంతో పాటు, మలయాళంలో మమ్ముట్టి సరసన ఒక చిత్రం చేస్తున్నారు. కాగా తను యాక్షన్ హీరోయిన్ కావాలనుకుంటున్నారనే ప్రచారం మీడియాలో జోరందుకుంది.

అది తన చెవికి తాకడంతో స్పందించిన వరలక్ష్మి యాక్షన్ పాత్రలు కోరుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు గానీ, అయితే అల్లాటప్పా పాత్రలు మాత్రం చేయదలచుకోలేదన్నారు. నటనకు అవకాశం ఉన్న బలమైన పాత్రల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జున్‌తో నటిస్తున్న నిపుణన్, మమ్ముట్టికి జంటగా నటిస్తున్న మలయాళం చిత్రాలు విడుదలైన తరువాత తన రేంజ్ మారిపోతుందనే విశ్వాసాన్ని వరలక్ష్మి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement