కొత్త కొత్తగా..! | Akhil Mr Majnu to release in January | Sakshi
Sakshi News home page

కొత్త కొత్తగా..!

Published Fri, Nov 9 2018 1:45 AM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

Akhil Mr Majnu to release in January - Sakshi

అఖిల్‌

జనవరిలో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు ‘మిస్టర్‌ మజ్ను’. అఖిల్‌ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మిస్టర్‌ మజ్ను’. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో అఖిల్‌ ప్లే బాయ్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దీపావళి సందర్భంగా అఖిల్‌ కొత్త లుక్‌ను విడుదల చేశారు.

అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అంటే కొత్త ఏడాదిలో అఖిల్‌ కొత్త కొత్తగా వస్తారన్నమాట. ఇంతకుముందే ఈ సినిమా ఫస్ట్‌ లుక్, టీజర్‌లను రిలీజ్‌ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా టాకీ పార్ట్‌ ఆల్మోస్ట్‌ పూర్తయిందట. ఫైట్స్, సాంగ్స్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉన్నాయని సమాచారం. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్‌ ఆది ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement