
నా రక్తం ఉడికి పోతోంది: టాప్ హీరో
డిసెంబర్ 31 రాత్రి బెంగళూరులో జరిగిన కీచర పర్వంపై బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ తీవ్రంగా స్పందించాడు.
ముంబై: డిసెంబర్ 31 రాత్రి బెంగళూరులో జరిగిన కీచర పర్వంపై బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ తీవ్రంగా స్పందించాడు. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని పేర్కొన్నాడు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ట్విటర్ లో వీడియో పోస్టు చేశాడు. మనుషుల కంటే జంతువులే నయమనిపించేలా బెంగళూరు ఘటనలు ఉన్నాయని పేర్కొన్నాడు. మానవజాతి తిరోగమనంలో ఉన్నట్టుగా భావించాల్సి వస్తోందని వాపోయాడు.
‘మనిషిగా ఈరోజు ఎంతో సిగ్గుపడుతున్నా. నాలుగేళ్ల నా కూతురితో నూతన సంవత్సర వేడుకలు జరుపుని తిరిగొచ్చిన నేను బెంగళూరులో జరిగిన కీచక పర్వం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాను. దీనిపై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. నా రక్తం ఉడుకిపోతోంది. మహిళను గౌరవించని సంఘం మానవ సమాజం అనిపించుకోలేదు. ఆధునిక వస్త్రధారణ కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయని చెప్పుకుంటున్న వారు తమ వ్యాఖ్యలను సమర్థించుకునే దమ్ముందా? మగాళ్లకు భయపడాల్సిన అవసరం మహిళలకు లేదు. ధైర్యంగా ఉండండి, ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాల’ని అక్షయ్ కుమార్ అన్నాడు.
అక్కీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ట్విటర్ లో 18 వేలకు పైగా లైకులు వచ్చాయి. 9 మందిపైగా రీట్వీట్ చేశారు.