స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాప్ గేర్‌లో దూసుకపోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగానే మరో ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నాడు. తనకు ఆర్య, ఆర్య 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్లనందించిన క్రేజీ డైరెక్టర్ సుకుమార్ సినిమాకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ చిత్ర షూటింగ్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, ‘సైరా’దర్శకుడు సురేందర్ రెడ్డి, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు. సురేందర్ రెడ్డి మూవీ స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేయగా.. కొరటాల శివ గౌరవదర్శకత్వం వహించాడు. దేవుడి చిత్ర పటాలపై అల్లు అరవింద్ తొలి క్లాప్‌నివ్వడంతో షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఇది బన్నీకి 20వ చిత్రం కావడంతో ‘AA20’అనే వర్కింగ్ టైటిల్‌ను చిత్ర బృందం ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో బన్ని ఢిపరెంట్ గెటప్‌లో కనిపంచనున్నట్లు సమాచారం. ‘రంగస్థలం’వంటి ఎపిక్ మూవీ అనంతరం సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే రంగస్థలం తర్వాత మహేశ్ బాబుతో ఓ సినిమా తీయాల్సి ఉండగా అది కుదరలేదు. దీంతో అల్లు అర్జున్‌తో ముచ్చటగా మూడో సినిమా తీయడానికి ఈ లెక్కల మాష్టర్ సిద్దమయ్యాడు. బన్ని కూడా తన 20వ చిత్రం కలకాలం గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో కథ, దర్శకుడి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. అయితే ఆ గోల్డేన్ ఛాన్స్ సుకుమార్‌కు ఇచ్చాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ నమోదవుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment