
పండగ వచ్చిందంటే చాలా మంది సోంతూర్లో వాలిపోతుంటారు. అక్కడే వేడుకలను జరుపుకోవడానికి ఇష్టపడుతుంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పండగలను కుటుంబంతో కలిసి పల్లెటూర్లలో జరుపకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దసరా వేడుకలను తన అత్తారింట్లో జరుపుకున్న బన్నీ.. సంక్రాంతిని మాత్రం తన సొంతూర్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన ఫ్యామిలీతో కలిసి సోమవారం రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన అభిమానులు రాజమండ్రి నుంచి పాలకొల్లు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఆదివారం రోజున పాలకొల్లు సమీపంలోని కాజా గ్రామంలో తన బంధువులు కొప్పినీడు కుటుంబం వారి అతిథి మర్యాదలను బన్ని స్వీకరించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కాగా, మంగళవారం రోజున బన్ని పలు దేవాలయాలను దర్శించుకోనున్నారు. అంతేకాకుండా పాలకొల్లులోని అల్లు వెంకటేశ్వరావు మెమోరియల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించనున్నారు.
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ కావటంతో బన్నీ తన తరువాత చిత్రానికి చాలా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందు ఇలా ఫ్యామిలీతో పండగలు, ముఖ్యమైన వేడుకలను మిస్ కాకుండా చేసుకుని, ఆ తర్వాత సినిమాతో బిజీ అయిపోతారు బన్నీ.
Comments
Please login to add a commentAdd a comment