పంద్రాగస్టుకి ఫస్ట్‌ లుక్‌ | Allu Arjun, Trivikram new movie first look released on august 15 | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టుకి ఫస్ట్‌ లుక్‌

Published Sun, Jul 28 2019 5:42 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

Allu Arjun, Trivikram new movie first look released on august 15 - Sakshi

చిత్రీకరణ చకా చకా జరుగుతోంది. సినిమాలోని ముఖ్య ఆర్టిస్టులంతా సెట్‌లో ఉండటంతో అంతా సందడి సందడిగా ఉంది. ఈ సందడంతా అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా లొకేషన్‌కి సంబంధించినది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.

సినిమాలోని ముఖ్య తారాగణంపై కుటుంబ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. తర్వాతి షెడ్యూల్‌ ఆగస్టు మొదటి వారంలో రాజమండ్రిలో మొదలు పెట్టడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అలాగే ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారట. సుశాంత్, టబు, జయరాం, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement