మేరీ జాన్..?
‘గౌరవం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమై, ‘కొత్త జంట’తో హిట్ సాధించిన అల్లు శిరీష్ నటిస్తున్న మూడో చిత్రం గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ‘యువత’, ‘సోలో’ చిత్రాల దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి ‘మేరీ జాన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే, ఇంకా టైటిల్ ఖరారు కాలేదని చిత్రబృందం పేర్కొంది.