అనుభవ పాఠాలు | Amala paul learns lessons from her own experience | Sakshi
Sakshi News home page

అనుభవ పాఠాలు

Published Thu, Nov 7 2013 3:46 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

Amala paul learns lessons from her own experience

   అనుభవాలు పాఠాలు నేర్పుతాయంటారు. తానొకటి తలస్తే దైవం మరొకటి చేస్తుందని నటి అమలాపాల్‌కు బాగా అర్థం అయ్యిందట. మైనా చిత్రంతో పల్లకి ఎక్కిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుసగా దైవ తిరుమగళ్, వేట్టై వంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో టాలీవుడ్ నుంచి పిలుపురావడంతో ఇంకేముంది స్టార్ ఇమేజ్ వచ్చేసిందని సంబరపడిపోయింది. అంతకంటే ఆనందం ఇళయదళపతి సరసన తలైవా చిత్రంలో నటించే అవకాశం రావడం. దీంతో ఉన్నత స్థానం ఖాయమని ఆశల పల్లకిలో ఊరేగింది.
 
  ఎంతగానో ఊహించుకున్న తలైవా చిత్రం ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో ఆమె కట్టుకున్న ఆశల గూడు పేకముక్కలా కూలిపోయింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో ఒక్క అవకాశం కూడా రాకపోవడం విశేషం. తెలుగులోనూ అదే పరిస్థితి. దీంతో అమలాపాల్‌కు ఒక్క విషయం బోధపడిందట. దేనిపైనా అంతగా ఆశ పెట్టుకోరాదని. ఇకపై ఏ విషయం గురించి అతిగా ఊహించుకోకూడదని, జరిగేది జరుగుతుందనే తత్వాన్ని అలవరుచుకుంటోందట. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ చిత్రాలు, ఒక మలయాళ చిత్రం ఉన్నాయి. ఇకపై జయాపజయాలను సీరియస్‌గా తీసుకోకుండా నటించాలని, అనూహ్య పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఉండాలని మానసికంగా సిద్ధమైనట్లు అమలాపాల్ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement