నా అందానికి కారణం అదే! | Amala Paul Released her Yoga Photos In Social Media | Sakshi
Sakshi News home page

నా అందానికి కారణం అదే!

Published Thu, May 3 2018 5:46 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Amala Paul Released her Yoga Photos In Social Media - Sakshi

నటి అమలాపాల్‌

హీరోయిన్‌ అమలాపాల్‌ ఏదో విధంగా వార్తలో ఉండటానికి ప్రయత్నిస్తుంది. గతంలో వివాదాస్పద వార్తలతో సంచలనం సృష్టించింది ఈ కేరళ బ్యూటీ. ప్రస్తుతం ఆసనాలతో ప్రచారంలో నిలుస్తోంది. శీర్షాసనం చేయండి శక్తిని పొందండి అంటోంది అమలాపాల్‌. అందం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ బ్యూటీ. వివాహనంతరం కూడా సన్నగా ఉండడానికి వ్యాయామమే ప్రధాన కారణమని ఆమె స్వయంగా పేర్కొన్నారు. యోగాసనాలకు ప్రధాన్యతనిచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా తను శీర్షానం చేసిన పోటోలను సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘యోగాలో తలకిందులుగా నిలబడి శీర్షాసనం వేయడం చాలా కష్టం. అందరూ సులభంగా ఈ ఆసనాన్ని చేయలేరు. కఠిన శిక్షణ ద్వారానే ఈ ఆసనం సాధ్యం. ఈ ఆసనం వేయడానికి చాలా కష్టపడ్డాను. దీనికోసం శిక్షకుడిని ఏర్పాటు చేసుకున్నాను. ఆరంభంలో గోడను ఆసరాగా చేసుకుని వేసేదాన్ని. ఫ్రీగా ఉన్నప్పుడు శిక్షణ పొందుతుంటాను. ప్రస్తుతం స్వయంగా తలకిందులుగా నిలిచి శీర్షానం చేయగలను. ఈ ఆసనం శరీరానికి శక్తినిస్తుంది’. అని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ కేరళ బ్యూటీ రక్షకన్‌ చిత్రంతోపాటు మలయాళం, తెలుగు భాషలోనూ నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement